నేను చాలా మాట్లాడాలి కదా

నా కాళ్ళూ చేతులూ కట్టేసుకుని,
నేను సముద్రంలోకి దూకాను.
ఎందుకంటే, నేను చాలా దూరం ఈదాలి కదా.
ఈదుతున్నప్పుడు కాళ్లూ, చేతులూ అడ్డొస్తాయి కదా.

నా నోరు కుట్టేసుకుని,
నేను ముఖ్య అతిథి కుర్చీ ఎక్కాను.
ఎందుకంటే, నేను చాలా మాట్లాడాలి కదా.
మాట్లాడేప్పుడు పెదాలు అడ్డొస్తాయి కదా.