సినిమా గొడవలకు పరిష్కారం ః సైన్స్ ఫిక్షన్ సినిమాలు మాత్రమే

ఆ కులపోళ్ళను తిట్టాడనీ,

ఈ ప్రాంతపు వారిని తిట్టాడనీ,

ఇలాంటి గొడవలకు లేకుండా తెలుగు సినిమాలు తియ్యాలంటే కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలు తియ్యడమే మార్గం.

అందులో అయితే స్టోరీలో ప్రాంతాలకతీతంగా, కులాలకతీతంగా వ్రాసుకోవచ్చు. కావల్సిన సందేశాలూ ఇచ్చుకోవచ్చు. అడిగోవాడుండడు. (చూసేవాడూ ఉండడంటే నేనేం చెయ్యలేను, ఎక్కడో ఒక చోట మొదలంటూ ఉండాలి కదా …. )

సురవర_స్వర్ణ ఖతి మునుజూపు

మేము సురవరలో స్వర్ణ అనే కొత్త ఖతిపై చాలా కాలం నుండి పనిచేస్తున్నాము. ఇంకా చివరి రౌండు టెస్టింగు మరియు ఇంటిగ్రేషన్ టెస్టింగు బాకీ, ప్రస్తుతానికి ఈ ఖతి ఇలా కనిపిస్తుంది. చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.

తెలుగు సైన్స్ ఫిక్షన్ రచయత(త్రు)ల ఆంగ్ల బానిసత్వం

తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచయతలు, భవిష్యత్తులో ఏదో ఒక గొప్ప సాంకేతిక అద్భుతాన్ని సృజిస్తారు, కానీ దాని పేరు మాత్రం ఆంగ్లంలోనే పెట్టేస్తారు!

మన వాళ్ల ఈ భాషా దరిద్రాన్ని కనీసం ఊహాలోకంలో అయినా వదలగొట్టలేమా?

మంచి మంచి తెలుగు పేర్లు తెలుగు ఆవిష్కరణలకు పెట్టుకోలేమా. సైన్స్ ఫిక్షన్ అనంగనే సగం ఆంగ్లం వాయించాల్సిందేనా? ఆ మాత్రం దానికి తెలుగులో చదువుకోవడం ఎందుకు, అంతకంటే మంచి మంచి సైన్స్ ఫిక్షన్ ఆంగ్లంలో కుప్పలు తెప్పలుగా సిద్ధంగా ఉంది కదా.

 

సైన్స్ ఫిక్షనులో మీరు సృజించే లోకాన్ని పూర్తి తెలుగు లోకంగానే ఉంచండి. ఏమీ రసాభస కాదు. ఇంకా చదవడానికి ఇంపుగా ఉంటుంది. భవిష్యత్తు తరానికి తెలుగు పదాలు సిద్ధం చేసిన వాళ్లమూ అవుతాము.

అననుసంధానించు కష్టంగా ఉంది….

ఉబుంటు తెలుగు లినక్స్ వాడుతున్నాను.
అనుసంధానించు,

అననుసంధానించు

అని ఉంది. Connect and disconnect లకు.

అర్థాలు బాగానే ఉన్నాయి. కానీ అనుసంధానించు, అననుసంధానించు ల మధ్య తేడా ఫాస్టుగా గుర్తించలేము. కనుక అననుసంధానించు (డిస్కనక్ట్) కు మనం వేరే పదం వాడటం బాగుంటుంది.

వినుసంధానించి
తుంచు
మీ సూచనలు చెప్పగలరు.

,,,,
కిరణ్ కుమార్ చావా
http://suravara.com
http://kinige.com
http://chavakiran.com

తెలుగు వికీపీడియాలో వ్యాసాలు యాబైవేలు చేద్దాం రండి.

అతర్జాతీయ మాతృభాషదినేత్సవం సందంర్భంగా తెలుగు వికీపీడియాలో వ్యాసాలు యాబైవేలు చేద్దాం రండి. ఈ రోజే ఒక మంచి కొత్త వ్యాసం తెలుగు వికీలో రాయండి. http://te.wikipedia.org