ఊరుకో ఊరుకో ఊర్మిలమ్మ నిదురపోతున్నదీ

ఊరుకో ఊరుకో ఊర్మిలమ్మ నిదురపోతున్నదీ,
ఊరుకో ఊరుకో లక్ష్మణుడు వేటకెళ్లాడు.

ఊరుకో ఊరుకో సీతమ్మ సింగారించుకుంటున్నది.
ఊరుకో ఊరుకో రాములోరు రాజకార్యాల మునిగారు.

ఊరుకో ఊరుకో నానులంతా సరయుకెళ్లారు.
ఊరుకో ఊరుకో హనుమ తపమునున్నాడు.

ఊరుకో ఊరుకో వాల్మీకు ఉత్తరానికేగాడు.
ఊరుకో ఊరుకో వశిష్టుడు దక్షిణానికేగాడు.

ఊరుకో ఊరుకో ఊర్మిలమ్మ నిదురోతున్నదీ.
లాలి లాలి లవుడా, లాలి లాలి.