సంధి కాలంలోని భారత రాజ్యాంగ రచన గురించి ….

గ్రాన్ విల్ ఆస్టిన్ రచించిన భారత రాజ్యాంగం దేశానికి మూల స్తంభం, పుస్తకం బాగుంది. ప్రభాకర్ మందార అనువాదం కూడా బాగుంది. సామాన్యునికి ఈ అనువాదం చేరువలో ఉంది.

గ్రాన్ విల్ ఆస్టిన్ కొండకచో కాంగ్రేసు వీరాభిమానిలా ఉన్నాడు, అయినా ఇది చదవదగ్గ పుస్తకమే. గతంలో నాకు రామచంద్ర గుహ (ఇతను కూడా నెహ్రూ వీరాభిమానిలా కన్పించాడు నాకు) పుస్తకాల్లో దొరకని సమాధానాలు ఈ పుస్తకంలో దొరికాయి. అసలు భారత దేశం ఇంకా ఎందుకు కలిసి ఉంది? తెలుగు దేశం, తమిళ దేశం, .. ఇలా ఎందుకు విడిపోలేదు? ఈ ప్రశ్నలకు గుహ కంటే ఆస్టిన్ పుస్తకమే సరిఅయిన సమాధానాలు అందించే మూలాలు కలిగి ఉంది.

నిజానికి ఈ పుస్తకం చదువుతుంటే, ఇటీవలే చూసిన బ్యాటిల్ ఫీల్డ్ గలాక్టికా సీరియల్ గుర్తు వచ్చింది. అందులో భూమి పూర్తిగా నాశనం అయి, కేవలం విమానాల్లో ఉన్న మానవులు మాత్రమే మిగులుతారు. 1947.. నాటికి భారత దేశం కూడా దేశ విభజన, మతకల్లోలాలు, తెలంగాణా సాయుధ తిరుగుబాటు, భాషా సమస్యలు, గాంధీ హత్య, సంస్థానాల విలీనం, యుద్దం వంటి పలు సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటి సమయంలో కుదురుగా కూర్చొని భవిష్యత్తును దర్శిస్తూ, నిర్దేశిస్తూ రాజ్యాంగాన్ని వ్రాయడం మాటలు కాదు.

మిగతా దేశాల రాజ్యాగాలకూ, భారత దేశ రాజ్యాంగానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. మిగతా రాజ్యాంగాలు స్వాతంత్ర్యానికి ముందో, తరువాతో వ్రాసుకున్నవి. కానీ భారద దేశ రాజ్యాంగం మాత్రం సంధికాలంలో వ్రాసుకున్నది. అంటే యుద్ధంలో నేరుగా చేరి, గాయైలవుతున్నా లెక్కించకుండా, కత్తి తిప్పడంలో మెళుకువలు పెంపొందించుకోవడం వంటిది. అప్పుడు యుద్ధం రాకపోతే, కేంద్రానికి ఇంత అధికారం ప్రాప్తించేది కాదేమో. అప్పుడు నెహ్రూ, రాజేంద్రప్రసాదుల మధ్య సయోధ్య అలా లేకపోతే రాష్ట్రపతి మరీ ఇలా రబ్బరు బొమ్మకాడేమో, తెలంగాణా వంటి సంఘటనలు లేకపోతే, రాష్ట్రాలకు మరిన్ని హక్కులు ఉండేవేమో. దేశవిభజన మరింత ముందు జరిగి ఉంటే భాషల విషయంలో దేశం మరో విధంగా ఉండేదేమో.

న్యాయశాఖ హక్కుల గురించి, భాషల గురించి, మతం గురించి, అల్పసంఖ్యాక వర్గాల గురించి, కార్యనిర్వాహక శాఖ గురించి, పంచాయితీల గురించి, గాంధీగారి గ్రామ స్వరాజ్యం గురించి ఇలా పలు విషయాలు చక్కగా వివరించారు ఈ పుస్తకంలో, ఆనాడు ఏఏవ్యక్తులు అతివాదులుగా, మితవాదులుగా ఉన్నారో చదువుతుంటే ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా చదవాల్సిని విషయం ఉన్న పుస్తకం ఇది. ప్రచురణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్. కినిగెలో ఈపుస్తకం మరియు ప్రింటు పుస్తకం రెండూ లభ్యం.

భారత రాజ్యాంగం – దేశానికి మూల స్తంభం On Kinige

3 thoughts on “సంధి కాలంలోని భారత రాజ్యాంగ రచన గురించి ….

  1. To be honest, I don’t think that our constitution is written; it is just a copy of (or) from multiple other constructions. Yes, I agree with you that the effort in bringing the points from different locations into one book, at that time is worth appreciated.

  2. చక్రవర్తి గారు,
    రాజ్యాంగం కాపీ అనేది గిట్టని వాళ్ళు చేసే ప్రచారం మాత్రమే. పిండి ఎక్కడ తెచ్చుకున్నా రోటీలు మనం వండుకున్నవే కదా. రకరకాల రాజ్యాంగాలు పరిశీలించారు. వాటి అనుభవం మనకు అవసరం కదా. ఏదీ గుడ్డిగా కాపీ కొట్టింది లేదు. అన్నీ కనీసం వందలాది మంది తూర్పారపట్టాకనే తీసుకున్నారు.
    అలా చూస్తే ప్రపంచంలోని రాజ్యాంగాలన్నీ ఆ ఫ్రెంచి విప్లవం తర్వాతి భావజాలానికి నకళ్లు మాత్రమే కదా!

  3. భారత రాజ్యాంగంలో చాలా అంశాలు ఇంకే రాజ్యాంగాలలో కనిపించవు. ఉదాహరణకు, రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ… వెస్ట్ మినిస్టర్ పద్ధతి పాటించే ఇంకే దేశము వారి వారి ముఖ్యాధిపతులను (“heads of states”ని) ఇలా ఇంచుకోవు. ఓస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు వారి వారి గవర్నర్ జెనరల్స్ ని నియమించుకోగా, సింగపూర్ వంటి దేశాలలో direct elections పద్ధతి పాటిస్తారు.

    ఇలాంటివి చాలా మెలుకువలు ఉన్నాయి, భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.